Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేస్కేల్ అమలు చేస్తామన్న హామీ నిలబెట్టుకోండి
- సీఎం కేసీఆర్కు రేవంత్రెడ్డి లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఏల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి ఆవేదనవ్యక్తం చేశారు. వారితో గొడ్డు చాకిరీ చేయించుకుని, వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. చాలీచాలని జీతాలతో ఏండ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఏల పరిస్థితి దుర్భరంగా ఉందని పేర్కొన్నారు. వెంటనే పేస్కేల్ అమలు చేయాలని కోరారు. ఈమేరకు మంగళవారం సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయాలనే సోయి లేదా? అని ప్రశింనచారు. ధరణి సమస్యలపై ఏర్పాటు చేసిన శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య అని తెలిపారు. అలాగే అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. వారికి సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు.