Authorization
Sat March 29, 2025 05:00:07 am
- ఎంఎస్ఎంఈ ఏడీసీ డి.చంద్రశేఖర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వాణిజ్య, వ్యాపారాభివృద్ధిలో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్ టీసీసీఐ) పాత్ర కీలకమని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ డి.చంద్రశేఖర్ తెలిపారు. ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించే పథకాలను వివరించారు. అయితే ఈ పథకాల లబ్ది క్షేత్రస్థాయిలో అందేందుకు ఛాంబర్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ స్కీంతో పాటు పలు పథకాలను గురించి ఆయన వివరించారు. ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు కె.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్గా చంద్రశేఖర్ రావు నియమితులవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ బలోపేతానికి సహకరిస్తామని తెలిపారు. సులభతర వాణిజ్యంలో తెలంగాణ ఉన్నత స్థితిలో ఉందని వెల్లడించారు. తయారీ రంగంలో కరోనా సమయంలో జాతీయ సగటు కన్నా రాష్ట్రం రికార్డు వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు కె.భాస్కర్ రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్, ఇండిస్టియల్ డెవలప్ మెంట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్ గరిమెల్ల, ఎఫ్టీసీసీఐ సీఇఓ ఖ్యాతి నరవనె పాల్గొన్నారు.