Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలోని పుప్పాలగూడ ప్రాంతంలోని వివాద భూమిపై దాఖలైన వేర్వేరు రిట్ పిటిషన్లను మంగళవారం హైకోర్టు విచారించింది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. విచారణను మార్చి 14కి వాయిదా వేసింది. పుప్పాలగూడలోని వివిధ సర్వే నెంబర్లల్లోని భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కొందరు, తమకు రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదని కాందిశీకులు విడివిడిగా వేసిన కేసుల్ని హైకోర్టు విచారణ చేపట్టింది. దేశ విభజన సమయంలో కట్టుబట్టలతో వచ్చిన కాందిశీకులకు భూములిచ్చేందుకు కేంద్రం ఎవాక్యూ ప్రాపర్టీ పేరుతో భూములిచ్చింది. గండిపేట మండలం పుప్పాలగూడలోని భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని కోరింది.