Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, తిమ్మాయిపల్లి ఐలాపూర్ గ్రామానికి చెందిన కార్మికుడు అల్లెపు ఎల్లయ్య (41) కువైట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. పదేండ్ల నుంచి జీవనోపాధి కోసం ఆయన అక్కడే నివసిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఎల్లయ్య ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని మతుని బంధువు అశోక్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ లండన్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం ద్వారా టిఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాలకు తెలిపారు.
వారి సహకారంతో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపారు. క్షణికావేశానికి లోనై గల్ఫ్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని కోరారు.