Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరిన ఈడీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దారుణమైన వడ్డీలకు అప్పులిచ్చి జనాన్ని పీల్చిపిప్పి చేస్తున్న పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్‌పై చర్యలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమర్ధించుకుంది. ఆ కంపెనీ డబ్బు రూ.15 కోట్లను జప్తు చేసిన మొత్తాన్ని విడుదల చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఈడీ హైకోర్టును కోరింది. జీతాలు ఇవ్వలేమంటూ తప్పుడుగా చెప్పి సింగిల్ జడ్జి నుంచి ఉత్తర్వులు పొందిందని చెప్పింది. ఈడీ అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చింది. కౌంటర్ వేయాలని ఆదేశించింది. రూ.178 కోట్ల పెట్టుబడితో 2 వేల శాతం వడ్డీతో జనానికి అప్పులు ఇచ్చి రూ.11,717 కోట్లను ఆర్జించిందని ఈడీ చెప్పింది. విచారణ వాయిదా పడింది.
పిల్‌ను కొట్టేయండి
ఆన్లైన్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) నిషేధం చేయాలని రాష్ట్రం కోరితేనే తాము చేయగలమని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. జీబీఎంఐని నిషేధించాలని అనిల్ స్టీఫెన్సన్ వేసిన పిల్లో కేంద్రం కౌంటర్ వేసింది. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు లేకుండా నేరుగా తాము నిషేధించలేమని చెప్పింది. పిల్‌ను కొట్టేయాలని కోరింది.