Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిజిఎం అమిత్ జింగ్రాన్ వెల్లడి
హైదరాబాద్ : గృహ రుణాల జారీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మార్కెట్ లీడర్‌గా ఉందని ఆ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా తమకు 23వేల శాఖలున్నాయన్నారు. గృహ రుణాలు రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది మాసాల్లోనే రూ.1 లక్ష కోట్ల రుణాలను జారీ చేశామన్నారు. ఇదే సమయంలో తమ సర్కిల్లో రూ.10,000 కోట్ల రుణాలు అందజేశామన్నారు. గృహ రుణ పోర్టుపోలియోలో మొత్తంగా రూ.44,580 కోట్ల రుణాలు జారీ చేశామన్నారు. 19000 గృహాలకు అప్పులిచ్చామన్నారు. 9100 టాప్ఆప్ల కింద రూ.1700 కోట్ల రుణాలు జారీ చేశామన్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన (పిఎంఎవై) కింద గడిచిన మూడేళ్లలో అర్హులైన వారికి రూ.373 కోట్ల సబ్సీడీ అందించామన్నారు. ఫిబ్రవరి 26, 27 తేదిల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మెగా ప్రాపర్టీ షోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ప్రాపర్టీలను బుకింగ్ చేసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేయడంతో పాటుగా ఆశ్చ్యరకరమైన బహుమతులు అందించనున్నామన్నారు.