Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రస్మా సెమినార్లో ప్రొఫెసర్ తిరుపతిరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగంలోని సమస్యలను ప్రభుత్వాలే ఆలోచించి పరిష్కరించాలని మణిపూర్ విశ్వవిద్యాలయం చాన్సలర్ ప్రొఫెసర్ టి తిరుపతిరావు అన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో విద్యారంగంపై సెమినార్ మంగళవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న రెడ్డి హాస్టల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత విద్యాసంస్థలకు కొత్తగా నిబంధనలు పెట్టొద్దని కోరారు. వాటిలో ఉన్న సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని సూచించారు. ఆస్తి పన్ను, కరెంటు బిల్లు కేటగిరీ మార్పు, ఫైర్ ఎన్వోసీ వంటి సమస్యలు ప్రభుత్వాలు తీర్చలేనంత పెద్దవి కావన్నారు. రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రయివేటు విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ట్రస్మా అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, చింతల రాంచందర్, ఆరుకాల రాంచంద్రారెడ్డి, కడారి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.