Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ బకాయిలను సర్కారు చెల్లించనుంది. 2021, ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 వాయిదాల్లో చెల్లిస్తామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022 మే నుంచి 18 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకూ పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని వివరించారు. మరణించిన ఉద్యోగుల బకాయిలను వారి కుటుంబాలకు ఒకేసారి చెల్లించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.