Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'బయ్యారం'పై బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి
- కిషన్‌రెడ్డిపై విమర్శలు అర్ధరహితం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర సర్కారు నిర్మిస్తానంటే ఎవరైనా అడ్డుకున్నారా? అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై నిందలు వేయడాన్ని టీఆర్ఎస్ నేతలు ఆపాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మాణం గురించి పరిశీలిస్తామని మాత్రమే కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చిందనీ, ఆ మేరకు దానిపై ఓ కమిటీని కూడా వేసిందని గుర్తుచేశారు. ఆ కమిటీ బయ్యారంలో పర్యటించి..అక్కడి ఇనుప ఖనిజంతో ఉక్కు తయారీ లాభసాటి కాదని తేల్చి రిపోర్టు ఇచ్చిందన్నారు. కేంద్రం సహకారం లేకుండానే సింగరేణి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామని ప్రకటించిన కేసీఆర్ ఎందుకు ఆ పనిచేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పి 15 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న మంత్రి కేటీఆర్ హామీ ఎక్కడకు పోయిందని నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీఆర్ఎస్ దీక్షలని విమర్శించారు.
న్యాయవాదిపై టీఆర్ఎస్ నేతల దాడిని ఖండిస్తున్నాం : మహిళామోర్చా
మల్కాజిగిరి కోర్టులో బీజేపీ నేత, న్యాయవాది ప్రసన్నపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గీతామూర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యాయవాది ముసుగులో ప్రసన్నపై దాడి చేసిన వారిని బార్‌కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయాలనీ, వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
న్యాయవాదిపై దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడాన్ని తప్పుబట్టారు.