Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 348 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్లో పేర్కొంది. మరో 1380 మంది టెస్టులు చేయించుకుని రిపోర్టుల కోసం వెయిట్ చేస్తున్నారని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 93 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 34, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 23, నల్లగొండ జిల్లాలో 20 చొప్పున కేసులొచ్చాయి. జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యల్పంగా ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.