Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ అధ్యక్షులు సంపత్కుమారస్వామి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండు నెలల పీఆర్సీ బకాయిలను 18 వాయిదాల్లో చెల్లిస్తామంటూ ప్రకటించడం సరైంది కాదని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీ) విమర్శించింది. ఈ మేరకు టీ అధ్యక్షులు చిలగాని సంపత్కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం కేటాయిస్తున్నదని తెలిపారు. కానీ ఉద్యోగులకు చెందిన స్వల్ప బకాయిలకు నిధులు కేటాయించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాన్ని పునరాలోచన చేయాలనీ, రెండు నెలల పీఆర్సీ బకాయిలను ఏకమొత్తంలో చెల్లించాలని కోరారు.