Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొలుపులను వెంటనే భర్తీ చేయాలని తెలుగుదేశం తెలంగాణశాఖ అధ్యక్షులు బక్కని నరసింహులు డిమాండ్ చేశారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన నిరుద్యోగ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం రాష్ట్రవ్యాప్త పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.
సొంత రాష్ట్రం స్వయంపాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ ట్రస్టీ మాత్రమేనని, తెలంగాణ ఆయన సొంతం కాదన్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పనిచేసిన కేసీఆర్.. పాలమూరు అభివద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. బర్రెలు, గొర్రెలు ఇచ్చిన ప్రభుత్వం.. ఉద్యోగాలు, విద్య, వైద్యాన్ని మరిచిందని విమర్శించారు. డీఎస్సీల ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు.
బండి సంజయ్ మతిలేకుండా మాట్లాడుతున్నారనీ, చంద్రబాబును విమర్శించే స్థాయి సంజరుకు లేదని హితవు పలికారు. ప్రధానులు, రాష్ట్రపతులను నిర్ణయించిన నాయకుడు చంద్రబాబు అని అభిప్రాయపడ్డారు. ఎంపీ పదవి, ఆధ్యక్ష పదవి శాశ్వతం కాదనే విషయాన్ని బండి సంజరు గుర్తుంచుకోవాలన్నారు.
తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు మూడు సార్లు లేఖ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి, తెలుగు మహిళా అద్యక్షురాలు ప్రొఫెసర్ టి.జ్యోత్స్న, ఇతర నేతలు పాల్గొన్నారు.