Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు బుధవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. 2020 ,సెప్టెంబరు తొమ్మిదిన అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా వీఆర్ఏలందరికీ పే-స్కేల్ ఇస్తామనీ, వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామనీ, అర్హులైన వారికి అటెండర్లు, వాచ్మెన్లు, కంప్యూటర్ అపరేటర్లు, డ్రైవర్లుగా పదోన్నతులు కల్పిస్తామని సీఎం హామీనిచ్చారని తెలిపారు. స్వగ్రామంలో డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరుచేస్తామని హమీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో వీఆర్వోలంతా ఆశతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. కాగా సీఎం హామీ అమలుకాకపోవడంతో వారంతా ఆందోళనతో ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్ఎల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద కుటుంబాలకు చెందినవారేనని, పనికిదగ్గ, పెరుగుతున్న ధరలకు అనుగుణ ంగా వేతనాలు ఇవ్వకపోవడంతో బతుకులు గడవక ఆర్థికంగా అనేక ఇబ్బం దులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరికి నెలకు ఇస్తున్న రూ.10,500పైనే 30 శాతం పెంచిన సర్కారు, పీఆర్సీ జీవో మాత్రం విడుదల చేయలేదన్నారు.
శాసనసభలో ఇచ్చిన హామీ ప్రకారం పే-స్కేల్, వారుసులకు ఉద్యోగాలు, అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించడంతో పాటు ఇతర పెండింగ్ సమస్యలనూ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.