Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అథారిటీని నియమించి రూ.431 కోట్లు విడుదల చేస్తే సరిపోదనీ, రాష్ట్రంలోని వెనుకబడిన నియోజవర్గాలకు కూడా అదే తరహాలో డెవలప్మెంట్ అథారిటీలను నియమించి విడుదల చేయాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి బుధవారం లేఖ రాశారు. గజ్వేల్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయనీ, వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర సర్కారుపై ఉందని గుర్తుచేశారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా దేశంలోనే అత్యంత వెనుకబడిన రెండో జిల్లా అని నిటిఅయోగ్ సర్వేలో తేలిందని తెలిపారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, డోర్నకల్, ఇల్లందు, తదితర నియోజకవర్గాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉందని సూచించారు.