Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంపై పొన్నాల ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత కుటుంబానికి అంకితం చేశారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 'మసిపూసి మారెడు కాయ' చందంగా కేసీఆర్ వ్యవహరముందని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్నసాగర్‌కు చుక్క నీరు రాదని చెప్పారు. పర్యాటకుల స్పాట్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. మైదాన ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయర్‌కు భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లితే జరిగే నష్టాన్ని ఉహించలేమన్నారు. కాళేశ్వరం వల్ల ఇప్పటి వరకు ఏ మాత్రం ఉపయోగం లేదని తెలిపారు.