Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషికి బీజేపీ రాష్ట్ర బృందం వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చట్టసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు, టీన్యూస్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సంజరు నేతృత్వంలోని బీజేపీ రాష్ట్ర బృందం వినతిపత్రం అందజేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో తెలంగాణ ఉద్యమకారులు, గిట్టని రాజకీయ పార్టీలు, పత్రికలు, ఛానళ్లపై విషం చిమ్ముతూ ఆ రెండు పత్రికలు, ఛానల్ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. టీన్యూస్ ఛానల్‌కు కేసీఆర్ ప్రభుత్వం ఏడేండ్ల కాలంలో వందల కోట్ల రూపాయల అడ్వర్టజ్మెంట్లు ఇచ్చి నిధుల దుర్వినియోగానికి రాష్ట్ర సర్కారు పాల్పడిందని విమర్శించారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ నేతలు జితేందర్‌రెడ్డి, స్వామిగౌడ్, చంద్రశేఖర్, ఎన్.రామచందర్‌రావు, వెదిరె శ్రీరాం, గంగిడి మనోహర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, విఠల్, రామచంద్రారెడ్డి, ప్రదీప్ కుమార్, బంగారు శృతి తదితరులు ఉన్నారు.