Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్య శాఖ కమిషనర్‌కు యూనియన్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నేషనల్ హెల్త్ మిషన్ ( ఎన్హెచ్ఎం) స్కీంలో పని చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఎఎన్ఎమ్లు, సెంకడ్ ఎఎన్ఎమ్లు, ల్యాబ్ టెక్నిషియన్లతోపాటు అన్ని రకాల సిబ్బందికి జీతాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఎన్హెచ్ఎం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) కోరింది. ఈమేరకు హైదరాబాద్‌లోని వైద్యారోగ్య శాఖ కమిషనరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం నర్సింహ్మా, రామా రాజేష్‌ఖన్నా, డి బాబు యాదవ్, డాక్టర్ ప్రతిమ, రాజేశ్వరి, పారిజాతం తదితరులతో కూడిన బృందం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. జీతాల పెంపుదలకు కృషి చేస్తామనీ, నిబంధనల ప్రకారం ప్రసూతి సెలవులు, అందరికీ పిఎఫ్ తప్పకుండా అమలు చేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా హామీనిచ్చారు.
సపోర్టింగ్ స్టాఫ్‌కు 2017 బేసిక్ ప్రకారం జీతాలు పెంచుతామని హమీ ఇచ్చినట్టు యూనియన్ అధ్యక్షులు ఎం నర్సింహ్మా ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన జీవో 510 ప్రకారం వేతనాలు పెంచకపోవడం విచారకరమన్నారు. మిగతా సిబ్బందితోపాటు ఎన్హెచ్ఎం కాంట్రాక్టు సిబ్బందికి 30 శాతం పీఆర్సీ పెంచి, వెంటనే అమలు చేయాలని కోరారు.