Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20పైగా అవగాహన కార్యక్రమాలు : వెబినార్లో డైరెక్టర్ జి.రామేశ్వర్రావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతీయ జల్జీవన్ మిషన్(ఎన్జేజేఎం)లో ఇంజినీరింగ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ) కీలక భాగస్వామిగా ఉందని డైరెక్టర్ జి.రామేశ్వర్రావు అన్నారు. ఈ మిషన్పై ఇప్పటికే 20కిపైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 600మందికిపైగా పాల్గొన్నారని తెలిపారు. 'హర్ ఘర్ నల్సే జల్ యోజన' పేరుతో 2024 నాటికి గ్రామగ్రామాన ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా నీరు అందించడమే లక్ష్యంగా మిషన్ అనే అంశంపై బుధవారం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పాల్గొన్న ఈ వెబినార్లో ఈఎస్సీఐ డైరెక్టర్ రామేశ్వర్రావు మాట్లాడుతూ.. జల్జీవన్ మిషన్ను గ్రామీణప్రాంతాల్లో అమలు చేయడానికి రూపొందించిన ప్రణాళికల్లో ఈఎస్సీఐ కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. మిషన్ అమలుకు ఈఎస్సీఐ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన ప్రణాళికలు, కార్యాచరణ, భవిష్యత్ ప్లాన్ గురించి వివరించారు.