Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో దేశ సగటును మించిన తెలంగాణ
- 'స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్..'లో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రాథమిక రంగమైన వ్యవసాయంలో మన రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. దేశం, రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులకు కొలమానంగా నిలిచే జీఎస్డీపీ, (రాష్ట్ర స్థూల ఉత్పత్తి), తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ స్థాయి వృద్ధిని మించిపోయింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ప్రతీ ఏడాది మన రాష్ట్రం పలు రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. ప్రస్తుత ధరలకనుగుణంగా తెలంగాణ జీఎస్డీపీ (2020-21) 11.8శాతం ఉండగా దేశ జీఎస్డీపీ 9.6శాతంగా నమోదైంది. తెలంగాణ తలసరి ఆదాయం 1.2 శాతంగా ఉంటే దేశ జీడీపీ 8.4కి దిగజారింది. వ్యవసాయం,విద్య,వైద్యం,ఇతర ప్రాథమిక రంగాల్లో కూడా రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక శాఖ, అర్థ గణాంక శాఖ రూపొందించిన స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సంబంధిత గణాంక నివేదికలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని రంగాల వారీగా పొందుపర్చారు. జీడీపీలో ఆరోస్థానంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632 కోట్లు కాగా జీఎస్డీపీ రూ.9,80,407 కోట్లుగా నమోదైంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రాష్ట్రం 14.3 శాతం వృద్ధి సాధించింది. ఇదే రంగంలో జాతీయ వృద్ధి రేటు 3.6శాతంగా నమోదవటం గమనార్హం.
అంకెలు ఘనం...
గణాంకాల ప్రకారం జీఎస్డీపీ, వృద్ధిరేటు తదితరాంశాల్లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉన్నట్టు కనబడుతున్నా... కీలకమైన రంగాల్లో వెనుకబడే ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు సంబంధించి బడ్జెట్లలో కేటాయింపులు ఘనంగా ఉంటున్నప్పటికీ ఖర్చులో మాత్రం వెనుకపట్టు పట్టినట్టు విదితమవుతున్నది.