Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు కేటీఆర్, మహమూద్‌అలీ, జగదీశ్వర్‌రెడ్డి నివాళి
- మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి
- అల్లం నారాయణకు ప్రముఖుల పరామర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ అంత్యక్రియలు బుధ వారం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. అల్లం నారాయణ ఇంటి వద్ద పద్మ భౌతికకాయానికి రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, మహమూద్‌అలీ, జి.జగదీశ్వర్‌రెడ్డి పూలమాలలేసి నివాళులు అర్పించారు. అల్లం నారాయణతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మెన్ జూలూరీ గౌరీశంకర్, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, బి.బసవపున్నయ్య, ఐఎఫ్‌డబ్ల్యూజే సీనియర్ నాయకులు పి.ఆనందం, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లెరవికుమార్, టీపీజేఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, కె.ఎన్.హరి, హెచ్‌యూజే అధ్యక్షులు ఇ.చంద్రశేఖర్, నాయకులు రాజశేఖర్, ఉన్నత విద్య పరిరక్షణ కమిటీ చైర్మెన్ డాక్టర్ అందెసత్యం, నవతెలంగాణ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు కె.ఆనందాచారి, టీఎన్జీఓ నాయకులు కృష్ణయాదవ్, పీఓడబ్ల్యూ నేత సంధ్య, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, సామాజికవేత్త సజయతో పాటు పలు పత్రికల ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, కార్టూనిస్టులు, తదితరులు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అల్లం నారాయణను పరామర్శించి ఓదార్చారు.