Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్‌పై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ వ్యాఖ్య
- 'తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్
- అబ్స్ట్రాక్ట్ -2021' విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వబోతున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తమ ప్రభుత్వానికి సంక్షేమ, అభివృద్ధి అనేవి రెండు కండ్ల లాంటివని ఆయన చెప్పారు. రాష్ట్ర అర్థగణాంక, ప్రణాళికా శాఖలు సంయుక్తంగా రూపొందించిన 'తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్-2021' ప్రచురణను బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ)లో వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆ శాఖ సలహాదారు జీఆర్ రెడ్డి, అర్థగణాంక శాఖ సంచాలకులు దయానంద్, అధికారులు శివకుమార్, రామబ్రహ్మం, రామకృష్ణ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.