Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలలుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం
నవతెలంగాణ-అక్కన్నపేట
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద భూ నిర్వాసితులు బుధవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. రెండు నెలలుగా తమకు పరిహారం ఇవ్వాలంటూ ప్రాజెక్ట్ వద్ద దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెడకు ఉరితాళ్లు బిగించుకొని గుడాటిపల్లి గ్రామ భూనిర్వా సితులు నిరసన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కంటే ముందే ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్ట్ ముంపులో భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారం ఇవ్వాలని దీక్ష చేస్తున్నా ప్రభుత్వం, ఎమ్మెల్యే, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. 2007లో నిర్మాణం పనులు ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్ట్ను 2014లో కుర్చీ వేసు కొని పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గౌరవెల్లి ప్రాజెక్టు తర్వాత 2016లో నిర్మాణం ప్రారంభించిన మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, అనంతగిరి ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. తమకు పూర్తి నష్టపరిహారం వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు.