Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తూ అకాల మరణం పొందిన కామ్రేడ్ లక్ష్మి సేవలు చిరస్మరణీయమని విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి ఎస్.వినయకుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లక్ష్మి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా లక్ష్మి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో తమ వంతు భాగస్వాములయ్యారని చెప్పారు. ఆమె మృదుస్వభావి, కష్టపడే తత్వం, ఎవరికీ హాని చేయని మనస్థత్వంతో పలువురి మన్ననలు పొందారన్నారు. ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె స్మతులు గుర్తు ఉంటాయన్నారు. బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, రఘుపాల్, ఐద్వా జాతీయ నాయకులు టి.జ్యోతి, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్, లక్ష్మి భర్త కృష్ణ ప్రసాద్, ఎస్వికె సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.