Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురోగతిపై సమీక్షలు జరపాలి : మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళిత బంధు లబ్దిదారుల ఎంపికను మరింత వేగవంతం చేసి, మార్చి నెలాఖరు నాటికి గ్రౌండింగ్ పూర్తిచేయాలని మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత బంధు పురోగతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన వారందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమీక్షా సమావేశంలో వక్ఫ్‌బోర్డు, ఎస్సీ కార్పొరేషన్ల చైర్మెన్లు మహ్మద్ సలీం, బండా శ్రీనివాస్, ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, రాహుల్‌బొజ్జ, యోగితారాణ, నదీమ్ అహ్మద్, రోనాల్డ్ రాస్, దివ్యదేవరాజన్, శ్రీదేవి, ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీం, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.