Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. వారికి పేస్కేల్ అమలు చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామనీ, సొంత ఊరిలోనే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చదువుకుని అర్హత ఉన్న వారికి ఇతర శాఖల్లో అటెండర్, జూనియర్ అసిస్టెంట్, ఇతర పోస్టులు ఇచ్చి సర్దుబాటు చేస్తామన్నారని తెలిపారు. కానీ ఇప్పటికీ ఆ హామీలు అమలుకు నోచుకోకపోవడంతో వీఆర్ఏలు నిరాశానిస్పృహల్లో ఉన్నారని పేర్కొన్నారు. 23 వేల మందిలో ఎక్కువ మంది ఎస్సీ,ఎస్టీ,బీసీలున్నారని వివరించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ మేరకు వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలనీ, పేస్కేల్ అమలు చేయాలనీ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.