Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవీఎల్ నారాయణ
- బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఫ్రీజ్ చేసిన ఐడీఏ బకాయిల చెల్లింపుల్లో బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవీఎల్ నారాయణ తెలిపారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం (సంచార్ భవనం) ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఐడీఏ ఫ్రీజ్కు వ్యతిరేకంగా కేరళ హైకోర్టుకు బీఎస్ఎన్ఎల్ సీఎండీని లాగినందుకు ఆయన ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. అందుకే ఐడీఏ బకాయిలతో పాటు కాంట్రాక్టు కార్మికుల వేతన బకాయిలను చెల్లించడం లేదని తెలిపారు. చాలా చోట్ల కాంట్రాక్టు కార్మికులకు 18నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని విమర్శించా రు. రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ బిల్లులు చెల్లించే విషయంలో బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ వివక్ష చూపుతోందనీ, వెంటనే అలవెన్సులు చెల్లించాలని కోరారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు ఎన్ఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లన్నీ వెంటనే అమలుచేయకపోతే.. పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సాయన్న, భూమయ్య, సాయిలు, సుభాష్, శ్రీనివాస్, ఉద్యోగులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.