Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ(ఫ్యాప్సి) బిల్డింగ్ లో బహిరంగ విచారణ నిర్వహించనుంది. 2022-23లో రూ.6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీ వల ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. బహి రంగ విచారణ లో వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈఆర్సీ పరిశీలించి చార్జీల పంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది.