Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో గజ్వేల్ విద్యార్థులు
నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్
వైద్య విద్యనభ్యసిం చడానికి ఉక్రెయిన్ వెళ్లిన గజ్వేల్ విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్నారని, వారిని స్వస్థలాలకు తీసుకురావాలని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్ పట్టణంలోని సిరి ఎన్‌క్లేవ్‌కు చెందిన నాంపల్లి దుర్గాప్రసాద్ ఉక్రెయిన్‌లోని కెలివ్ ప్రాంతంలో ఎంబీబీఎస్ 5వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ ప్రాంతం రష్యా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని సమాచారం. అలాగే గజ్వేల్ మండలం అహమ్మదీపూర్కు చెందిన ఆనంతోజు ప్రవళిక ఉక్రెయిన్‌లోని జఫ్రెం సిటీలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నది. కాగా ఉక్రెయిన్, రష్యా దాడులకు పాల్పడుతుండటంతో వారిని సురక్షితంగా ఇంటికి చేర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో హుటాహుటిన వారిని తీసుకుని హైదరాబాద్‌లో ఉన్న మంత్రిని కలవడానికి ప్రతాప్‌రెడ్డి బయల్దేరారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చుతామని ఆయన హామీ ఇచ్చారు.