Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో మైనార్టీలకు తీవ్ర అన్యాయం : ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్
- హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆవాజ్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర బడ్జెట్ 2022-23లో మైనార్టీల సంక్షేమానికి రూ.5000కోట్లు కేటాయించాలని, తద్వారా చిన్న వృత్తులు చేసుకునే వారికి, వీధి వ్యాపారులకు, మహిళలు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం చేయాలని ఆవాజ్ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగింద న్నారు. దాదాపు 39 లక్షల కోట్ల బడ్జెట్లో మైనారీ ్టలకు కేవలం రూ.5 వేల కోట్లు కేటాయించిందని విమర్శించారు.దేశ జనాభాలో 30 కోట్ల వరకు ఉన్న మైనార్టీలకు కేవలం 5వేల కోట్లు కేటాయించడం దుర్మార్గమని, ఈ బడ్జెట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్ల కాలంలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేసిందని, ఇందులో మైనార్టీ సంక్షేమ బడ్జెట్ రూ.6500 కోట్లకు మించలేదని అన్నారు. తెలంగాణలో ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతరులు కలిపి 15శాతం ఉంటారని, ఇందులో మైనార్టీలు 12శాతం వరకు ఉన్నారని చెప్పారు. సుధీర్ కమిషన్ మైనార్టీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిందన్నారు. ఆ మేరకు వచ్చే బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించి.. ఇందులో ముస్లిం మైనార్టీల కోసం రూ.5వేల కోట్లు కేటాయించాలన్నారు. తద్వారా చిన్న వృత్తులు చేసుకునే వారికి, వీధి వ్యాపారులకు, మహిళలు, నిరుద్యోగ యువతకు దళితబంధు మాదిరిగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నేరుగా రూ.5లక్షల ఆర్థిక సహాయం చేసి వారి అభివృద్ధికి తొడ్పాటు అందించాలన్నారు. నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. ఉపకార వేతనాలు, మైనార్టీ గురుకులాలు మినహా మైనార్టీ సంక్షేమానికి పెద్దగా బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. డ్రైవర్ సాధికా రత పథకం, డ్రైవర్ కమ్ ఓనర్ పథకాలు నిలిచి పోయాన్నారు. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే బడ్జెట్‌ను పెంచ కుండా సాధ్యం కాదన్నారు. ఈ బడ్జెట్లో రూ.5వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలనీ, మైనార్టీబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్ ఖాన్, నాయకులు ఆయూబ్ ఖాన్, మహమ్మద్ బాబా, మహమ్మద్ జబ్బార్, ఎండీ అబీబ్, సయ్యద్ జాఫర్, సయ్యద్ ఇబ్రహీం పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ మధుసూదన్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కమిటీ జిల్లా కార్యదర్శి మహమ్మద్ గౌస్, ఆవాజ్ జిల్లా నాయకులు ఎస్.కె. బాబు పాల్గొన్నారు.