Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 శాతం ఫీజులు పెంచేందుకు అనుమతించండి : విద్యాశాఖ కార్యదర్శికి ట్రస్మా వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ప్రయివేటు విద్యాసంస్థల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అనువుగా రెండేండ్లపాటు చట్టాలు, కమిటీలంటూ ఇబ్బందులకు గురిచేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రస్మా కోరింది. శుక్రవారం హైదరాబాద్‌లో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సంచాలకులు శ్రీదేవసేన, అదనపు సంచాలకులు లింగయ్యతో ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు నేతృత్వంలో ఫీజు నియంత్రణ చట్టంపై చర్చలు జరిపారు. గతంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీగా ఏర్పాటైన తిరుపతిరావు సూచనలను వెంటనే అమల్లోకి తేవాలని కోరారు. కరోనా కారణంగా రెండేండ్లుగా విద్యాసంస్థలు మూతపడ్డాయని తెలిపారు. ఈ కారణంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫీజులు పెంచలేదని పేర్కొన్నారు.
వచ్చే విద్యాసంవ్సరం 30 శాతం ఫీజులు పెంచేందుకు అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా కోశాధికారి ఐవి రమణరావు, సలహాదారులు ప్రసాదరావు, పరంజ్యోతి, నాయకులు పి రమణరావు, ఎ శ్రీకాంత్‌రెడ్డి, క్యాథలిక్ అసోసియేషన్ ప్రతినిధి శౌరెడ్డి, మైనార్టీ విద్యాసంస్థల నుంచి అక్తర్ షరీఫ్, ఇస్మా నుంచి ప్రవీణ్‌రాజు, చౌదరి, అంతర్జాతీయ విద్యాసంస్థల ప్రతినిధి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.