Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ, సహాయ కార్యదర్శి పోటు రంగారావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్యవాద శక్తులు, నాటో కూటమి, రష్యా మధ్య వ్యాపార, ఆధిపత్య పోరులో భాగంగానే ఉక్రెయిన్పై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. విధ్వంసకర, వినాశనాన్ని, ప్రజల కష్టాలను తీవ్రం చేసే ఈ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించారు. సామ్రాజ్యవాద దేశాల మధ్య విస్తరణ, ఆధిపత్య పోరులో ఉక్రెయిన్ తీవ్ర కష్టాలకు గురవుతున్నదని పేర్కొన్నారు. ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి అయ్యే సరుకులు ఆగిపోయి ధరలు పెరిగి సంక్షోభం వచ్చే ప్రమాదముందని తెలిపారు.