Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణి పోర్టల్‌లో లొసుగులను పరిష్కరించాలి
- సీఎస్ సోమేశ్‌కుమార్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో సర్వేనెంబర్ల వారీగా భూమిని డిజిటల్ సర్వే చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో 90 ఏండ్ల కింద భూసర్వే జరిగిందని వివరించారు. చాలా చోట్ల సర్వేనెంబర్ల వారీగా హద్దు రాళ్లు లేనందున వివాదాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, భూదానయజ్ఞ భూములు అన్యాక్రాంతమవు తున్నాయని తెలిపారు. సర్వే చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఆర్నెల్లు దాటినా అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. తక్షణమే సమగ్ర భూసర్వే చేపట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్‌లో లొసుగులను పరిష్కరించాలని కోరారు. మండల రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో లొసుగులను తొలగించడానికి మంత్రివర్గ ఉపసంఘం వేసినా ఇప్పటికీ పరిష్కారం లభించలేదని తెలిపారు. సాదాబైనామాలకు సంబంధించి ధరణి పోర్టల్‌లో ఆప్షన్ పెట్టాలని కోరారు.
యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలి
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేడు గ్రామానికి చెందిన యువతిపై సామూహికంగా లైంగికదాడికి పాల్పడి ఆమె చావుకు కారణమైన కానిస్టేబుల్ హుస్సేన్, యట సాగర్, జగదీశ్, నాజీంలను కఠినంగా శిక్షించాలని చాద వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్బెడ్రూం ఇల్లు ఇవ్వాలని కోరారు.