Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిజిటల్ మిషన్ వర్క్‌షాప్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆయుష్మాన్ భారత్ మిషన్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై మొదటి జాతీయ స్థాయి వర్క్‌షాప్ శుక్రవారంతో ముగిసింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబీడీిఎమ్), హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎమ్ఐఎస్)పై న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు, నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ (ఎన్ఎఐఆర్), రైల్ టెల్, నేషనల్ హెల్త్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించిన మొదటి జాతీయ వర్క్‌షాప్ సికింద్రాబాద్‌లోని లాలాగూడా సెంట్రల్ రైల్వే ఆస్పత్రిలో నిర్వహించారు. వీరు భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో, ప్రొడక్షన్ యూనిట్లలో తదుపరి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిజిటల్ హెల్త్‌కేర్ మౌలిక సదుపాయాలపై అవగాహన, వివిధ సంస్థల పనిచేస్తున్న వైద్యుల సందేహాలను నివృత్తి చేయడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు.