Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ కె.రాజిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇందిరాపార్కు వద్ద నేడు తలపెట్టిన రిలే నిరాహారదీక్ష అనుమతిని ఆఖరి నిమిషంలో పోలీసులు నిరాకరించడాన్ని ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ కె.రాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జేఏసీ ముఖ్య నాయకులు 16న సెంట్రల్ జోన్ డీసీపీని కలిసి అనుమతి కోసం దరఖాస్తు చేశారనీ, ఆ దరఖాస్తును స్వీకరించి ఒక రోజు ముందు అనుమతిస్తామని తెలిపారన్నారు. డీసీపీ ఇచ్చిన హామీ మేరకు తిరిగి శుక్రవారం మధ్యాహ్నం వరకు అనుమతిస్తామని చెప్పి సాయంత్రం తిరస్కరించారని తెలిపారు. ఈ నెల 28న అనుమతిస్తానని చెప్పి సంతకం పెట్టే ముందు అసెంబ్లీ సమావేశాల తర్వాత అనుమతిస్తానని మాటమార్చారని విమర్శించారు. ఈ చర్యలు ఆర్టీసీ కార్మిక ఉద్యమంపై ప్రభుత్వం వివక్ష చూపిస్తున్నట్టుగా జేఏసీ భావిస్తున్నదని తెలిపారు. జేఏసీ ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. త్వరలో జేఏసీ సమావేశమై తదుపరి కార్యక్రమాన్ని నిర్ణయిస్తామన్నారు.