Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యఅతిధిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
- 1,19,106 మందికి పట్టాలు ప్రదానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) పదో స్నాతకోత్సవం శనివారం జరగనుంది. ఈ సందర్భం గా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిధిగా గవర్నర్, వర్సిటీ చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ హాజరవుతారని వివరించారు. డీఎస్టీ సెక్రెటరీ శ్రీవారి చంద్రశేఖర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామన్నారు. యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో 2019-20, 2020-21 విద్యాసంవ త్సరాలకు కలిపి 1,19,106 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేస్తామని చెప్పారు. 95 మందికి బంగారు పతకాలు అందజేస్తామన్నా రు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అక్టోబర్ రెండున గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమ వర్సిటీ స్వర్ణోత్సవాలను ప్రారంభించారని గుర్తు చేశారు. అందులో భాగంగా వర్సిటీ ప్రగతి కోసం పలు కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. సెప్టెంబర్ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్ యూజీలో ఎనిమిది, పీజీలో రెండు కొత్త కోర్సులతోపాటు రెండేండ్ల ఎంబీఏను ప్రారంభించామని వివరించారు. ఐఐసిటీ, డీఎంఆర్ఎల్, డీఆర్డీఎల్, డీఆర్డీవో, డీఎల్ఆర్ఎల్, ఆర్సీఐ, బీహెచ్ఈఎల్, ఎన్ఆర్ఎస్సీ, సీఐటీడీ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పరిశోధనల కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ, డీఎస్టీ, డీఆర్డీవో, ఇస్రో రూ.12.37 కోట్ల పరిశోధనల ప్రాజెక్టును మంజూరు చేశాయని వివరించారు.ఆవిష్కరణల కోసం జేహబ్ను ప్రారంభించామన్నారు.