Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంప్రదించాల్సిన నెంబర్లు ఇవే 70425 66955, 99493 51270, 96456 63661
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు, ప్రవాసుల సంరక్షణ కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్, హైదరాబాద్‌లోని సచివాలయంలో ప్రత్యేక హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రకటించారు. బాధితులు 70425 66955, 99493 51270, 96456 63661 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈమేరకు శుక్రవారం సీఎస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారి యోగ క్షేమాల విషయంపై ఎప్పటికప్పుడు భారత విదేశీ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. వారిని రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ భవన్లో నెలకొల్పిన కంట్రోల్ రూం 3 షిఫ్టులలో 24 గంటల పాటు పనిచేస్తున్నదని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్‌కు 150 కాల్స్ వచ్చాయని తెలిపారు. వాటిలో ఉక్రెయిన్ నుంచి 10-12 వచ్చాయనీ, కాల్ చేసిన వారి వివరాలు నోట్ చేసుకుని తెలిపారు. ఆందోళన చెందవద్దని వారికి భరోసా కల్పించామని తెలిపారు. 90 శాతం తెలంగాణ విద్యార్థులు చదువుతున్న జప్రోజియా మెడికల్ యూనివర్సిటీకి చెందిన భారత ప్రతినిధితో మాట్లాడామని పేర్కొన్నారు. దీంతో పాటు ఉక్రెయిన్‌లో చదువుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.