Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ మెయిన్స్ - 2022 కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష ద్వారా మెరిట్లో ఉత్తీర్ణులైన 100 మంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణతో పాటు స్కాలర్ షిప్, బుక్ మెటీరియల్, లైబ్రరీ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. దీంతో పాటు సివిల్ సర్వీస్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అధ్యాపకులు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాల కోసం 63024 27521 నెంబర్లో సంప్రదించాలని తెలియజేశారు.