Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలను, ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రంధాలయాలు, బస్టాండ్లు, విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు..