Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కృష్ణానదీ యాజమాన్య బోర్డు సోమవారం తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించటంపై నెలకొన్న జాప్యంపై కీలక చర్చ జరగనుంది. ఈ జాప్యం తగదంటూ తెలంగాణ, ఏపీకి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఇటీవల సూచించారు. సంబంధిత గెజిట్ను విధిగా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించబోయే బోర్డు సమావేశం... ప్రాధాన్యతను సంతరించుకుంది.