Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్
- ప్లకార్డులతో నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను ప్రజానుకూంగా సవరించాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బడ్జెట్ పేదలను పూర్తిగా విస్మరించిందని పేర్కొంది. కార్పొరేట్, పెట్టుబడిదారులకు అనుకూలంగా రూపొందించిన బడ్జెట్...పేదలకు వ్యతిరేకమైందని విమర్శించింది. స్వదేశీ, విదేశీ కార్పొరేట్లు మరింత సంపద పోగు చేసుకునేందుకు బీజేపీ సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుందని తెలిపింది. బడ్జెట్‌ను ప్రజానుకూలంగా మార్చాలనే డిమాండ్‌పై దేశవ్యాప్త పిలుపులో భాగంగా ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాసంక్షేమానికి కోతలు పెట్టిన బడ్జెట్‌ను సవరించి, పేదల బడ్జెట్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్‌ను సంక్షేమ బడ్జెట్‌గా మార్చాలి? : ఎం సాయిబాబు
కేంద్ర బడ్జెట్‌ను సంక్షేమ బడ్జెట్‌గా రూపొందించాలని సీఐటీయు అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబు విమర్శించారు. కరోనా సమయంలో ప్రజల ఆదాయం తగ్గిపోయి. ఉపాధికరువై తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరుగుతున్నదని తెలిపారు. మోడీ సర్కారు ఎరువుల సబ్సిడీకి కోతలు పెట్టి రైతులపై భారంమోపిందని విమర్శించారు. చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దేశ రక్షణ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్త్నుదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయనీ, కొద్దిమంది సంపన్నుల వద్ద 64శాతం సంపద పోగైందన్నారు. ప్రజల ఆశలను బీజేపీ సర్కారు వమ్ము చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా పేదల సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆశలను వమ్ము చేసింది : టి సాగర్
కేంద్రబడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలను మోడీ ప్రభుత్వం వమ్ముచేసిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ చెప్పారు. ప్రజలపై భారాలు మోపి, కార్పొరేట్ శక్తులకు పన్నుల్లో రాయితీ ఇచ్చిందన్నారు. ధాన్యం సేకరణను నుంచి తప్పించుకునేందుకే ఆ అంశానికి రూ.11వేలకోట్లు తగ్గించిందని చెప్పారు. అన్నదాతలకు ఇచ్చే ఎరువులపై సబ్సిడీ తగ్గించడంతో మరింత భారం పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎంకిసాన్ సమ్మాన్‌కు సైతం బడ్జెట్లో భారీ కోతలు పెట్టిందన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు రుణమాఫీ చేస్తామన్న హామీని విస్మరించిందని విమర్శించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం దేశంలోని రైతులకు రూ. 22 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో రైతు సంక్షేమానికి అనుకూలంగా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.
ధరల నియంత్రణకు చర్యలు లేవు : ఆర్ వెంకట్రాములు
పెరుగుతున్న ధరలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు చెప్పారు. ధరల నియంత్రణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆకలి, దరిద్రం, అసమానతలు పెరిగిపోతున్నాయని తెలిపారు. జాతీయ ఆదాయాన్ని పెంచేలా కేంద్ర బడ్జెట్ లేదన్నారు. ఆహారభద్రతకు నిధులు తగ్గించడమంటే పేదరికాన్ని విస్మరించడమేనన్నారు. ఉపాధి హామీ చట్టానికి కేంద్రం రూ 25 శాతం కోత విధించిందని విమర్శించారు. తెలంగాణ వృత్తిసంఘాల సమన్వయ కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ కార్మికులు, రైతులు, వృత్తిదారుల సంక్షేమాన్ని బడ్జెట్ విస్మరించిందన్నారు. చేనేతపై జీఎస్టీ భారం మోపిందని విమర్శించారు. మత్స్యకారులు, గోల్డ్‌స్మిత్‌ల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, ఐద్యా ఉపాధ్యక్షులు కెఎన్ ఆశాలత, పీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్వి రమ, వంగూరు రాములు, కోటంరాజు, కూరపాటి రమేష్, వాణి (సీఐటీయూ), నంద్యాల నర్సింహ్మారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, మూడ్ శోభన్ (తెలంగాణ రైతు సంఘం), బి ప్రసాద్, బొప్పని పద్మ (వ్యవసాయ కార్మిక సంఘం), వెంకటేశ్ (ఎన్పీఆర్డీ) అవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహ్మద్‌ఖాన్ (పాషా) తదితరులు పాల్గొన్నారు.