Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు శుక్రవారం ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తమన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.