Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాటుకు ముందుకొచ్చిన టెక్స్‌పోర్ట్ ఇండిస్టీస్
- మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిరిసిల్లలో అపారల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్‌పోర్ట్ గ్రూపు ముందుకొచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో టెక్స్‌పోర్టు గ్రూపు అవగాహన ఒప్పందం కుదుర్చుకు ంది.సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం అపారల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో పరిశ్రమలకు సంబంధించి పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. 63 ఎకరాల సువిశాల పార్క్‌ను సుమారు రూ.175 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న దీనిద్వారా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశమున్నది.వస్త్రాల ఉత్పత్తితోపాటు ఎగుమతు లకు అనుగుణంగా బిల్ట్ టు సూట్ పద్ధతిన దేశంలోనే తొలిసారిగా ఈ పార్క్ ఉండనుంది. సిరిసిల్ల అపారల్ పార్క్‌లో 7.42 ఎకరాల స్థలంలో టెక్స్‌పోర్ట్ సంస్థ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.రెండు వేల మందికి ఉపాధి లభించే అవకాశమున్నది. సుమారు రూ.60 కోట్లతో దీని నిర్మాణం జరగనుంది. చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజరామయ్యర్, టెక్స్‌పోర్ట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర డి గోయెంకా అవగాహన ఒప్పందాన్ని మార్చుకున్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి,ఈ రంగంలో పనిచేస్తున్న నేతన్న ల సంక్షేమానికి,వృత్తినైపుణ్యం పెంపుదలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ పరిశ్రమను నెలకొల్పేందుకు అన్ని రకాలుగానూ సహకారం అందిస్తామన్నారు.