Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిఘటనా పోరాటాల్ని హేళన చేయొద్దు : న్యూడెమోక్రసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాఉద్యమ కార్యాచరణలో పార్టీల చీలికలు విప్లవోద్యమానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యులు దర్శన్‌సింగ్ కట్కర్ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని మార్స్క్ భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో కేంద్ర కమిటి సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, పి సూర్యం, బి ప్రదీప్, మధు, రాష్ట్ర కమిటి సభ్యులు జి.ఝాన్సీ,జేవి చలపతిరావు, వి కోటేశ్వరరావు, టి శ్రీనివాస్, ప్రజాసంఘాల నాయకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కట్కర్ మాట్లాడుతూ తమ పార్టీ కేంద్ర కమిటిపై ప్రజాపంథా పేరుతో వేరుపడిన కొందరు చేస్తున్న ఆరోపణ సరికాదన్నారు. దేశంలో మోడీ పాలన అత్యంత నియంతృత్వంగా సాగుతున్న తరుణంలో విప్లవ కారుల ఐక్యత మరింత అవసరమని చెప్పారు. ప్రతిఘటనా పోరాటాల ద్వారానే అంతిమంగా దోపిడి పాలన అంతమవుతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విభాగం విడిపోయి, పార్టీనీ, ఉద్యమాన్నీ కాపాడుతామని చేస్తున్న వాదన అత్యంత హాస్యాస్పదమైందనివెంకట్రామయ్య అన్నారు. కేంద్ర కమిటి పిడివాద ఆలోచనలతో పనిచేస్తున్నదనే తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదనిపోటు సూర్యం అన్నారు. ఝాన్సీ మాట్లాడుతూ ఏ పార్టీలోనైనా భిన్నాభిప్రాయాలు ఉంటాయన్నారు.