Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన 33 పోలీసు జాగిలాలు శిక్షణ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీసుల నేర పరిశోధనలో పోలీసు జాగిలాల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర హౌంశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రవిగుప్తా అన్నారు. శనివారం మోయినాబాద్‌లోని ఇంటిగ్రేడెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమిలో 33 పోలీసు జాగిలాల శిక్షణ ముగింపు కవాతుకు రవిగుప్తా ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా 47 మంది పోలీసు జాగిలాల శిక్షకులు కూడా తమ ట్రైనింగ్‌ను ముగించుకుని పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్‌కుమార్ , సీఐ సెల్ ఐజీ రాజేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేర పరిశోధనలో నిర్లక్ష్యం తగదు : అంజనీకుమార్
రాష్ట్రంలో నేర పరిశోధనలో దర్యాప్తు అధికారులు ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించరాదని , దర్యాప్తులో మరింత ప్రతిభా పావాలను చూపించాలని రాష్ట్ర ఇన్‌ఛార్జి డీజీపీ అంజనీకుమార్ సూచించారు. శనివారం తన కార్యలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో ఆయన నేర పరిశోధనతో పాటు వివిధ అంశాలపై వీడియా కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు.