Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ రియాల్టీకి రాజధాని : జింగ్రన్
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మెగా ప్రాపర్టీ షో ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 26, 27 తేదిల్లో హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను శనివారం ఆ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సిజిఎం) అమిత్ జింగ్రన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎస్బిఐ ఉన్నతాధికారులు జయేష్ చంద్ర సాహు, క్రిష్ణన్ శర్మ సహా క్రెడారు హైదరాబాద్ ప్రెసిడెంట్ పి రామ క్రిష్ణా రావు, జనరల్ సెక్రటరీ వి రాజశేఖర్ రెడ్డి, టిబిఎఫ్ ప్రెసిడెంట్ సి ప్రభాకర్ రావు, ట్రెడా ప్రెసిడెంట్ చలపతి రావు హాజరయ్యారు. హైదరాబాద్ సర్కిల్ జిఎం క్రిష్ణ శర్మ ప్రారంభోపన్యాసం చేశారు. జింగ్రన్ మాట్లాడుతూ భారత్‌లోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రాజధానిగా మారనుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి రియల్ ఎస్టేట్ రూ.5009 కోట్లకు చేరి దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. క్రెడారు, ట్రెడా, టిబిఎఫ్ ఆఫీసు బేరర్లు మాట్లాడుతూ ఎస్‌బిఐని ప్రశంసించారు. ఈ సందర్బంగా పలు బ్యాంకింగ్ నిబంధనలతో తమకున్న ఇబ్బందులను వివరించారు.