Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ చైర్మెన్ రాజిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీపై భారం పడేలా పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలనీ, నిరసనదినం పాటించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ కె రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టీసీ లాంటి ఎక్కువ డీజిల్ వాడే సంస్థలకు తీవ్రమైన భారం పడేలా కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.ఏడు పెంచడాన్ని శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ ఆయిల్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వల్ల లీటరుకు రూ.ఐదు పెరిగినా సుమారు రూ.వంద కోట్ల భారం ఆర్టీసీపై పడుతుందని తెలి పారు. 2019, డిసెంబర్ నాటి ధరలను స్థిరీకరించి అప్పటి నుంచి పెరుగుతున్న డీజిల్ ధరల భారాన్ని తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభు త్వం రీయింబర్స్ చేయాలని జేఏసీ కన్వీనర్ విఎస్ రావు పేర్కొన్నారు. జేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకుల సమన్వయంతో ఈ నిరసన దినాన్ని జయప్రదం చేయాలని కోకన్వీనర్ సుద్దాల సురేష్ తెలిపారు.