Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు ముఠాల అరెస్ట్
- నిందితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు,సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు డేగ కన్నేశారు. మాదకద్రవ్యాలు, గంజాయి విక్రయిస్తున్న నాలుగు ముఠాలకు చెందిన (సరఫరా దారులు, కోనుగోలు దారులు) 16 మందితోపాటు నైజీరియన్‌ను నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, సివిల్, టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.14లక్షల డ్రగ్స్, గంజాయితోపాటు ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా డార్క్‌నెట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు. డ్రగ్స్ తీసుకునే వారిలో కార్పొరేట్ కంపెనీల్లో మంచి స్థానాల్లో ఉన్న ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు ఉన్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి గుట్టుగా విక్రయిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి స్టూడెంట్స్ వరకు డ్రగ్స్, గంజాయి విక్రయాల్లో ఉంటున్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు. మరోసారి డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.