Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్ కుమార్
చార్టర్డ్ అకౌంటెన్సీలో అపార అనుభవం సాధించిన కె సునీల్ కుమార్.. విద్యార్థుల కెరీర్‌కు సంబంధించి పలు అంశాలను వివరించారు. ఆడిట్, చట్టపరమైన అనుసరణలు, పన్నులు, అకౌంటింగ్, తదితర అంశాలకు సంబంధించిన అంశాలను నవతెలంగాణకు తెలియచేశారు. అలాగే ఇంటర్మీడియట్/డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కెరీర్ ఓరియెంటెడ్ కామర్స్ కోర్సులకు సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించారు.
ఇంటర్మీడియట్/డిగ్రీ తర్వాత ఏ ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించాలి?
చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెంట్సీ, కంపెనీ సెక్రటరీ.
ఐసీఎస్ఐ అంటే ఏమిటి?
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) అనేది పార్లమెంట్ చట్టం (కంపెనీ సెక్రటరీస్ యాక్ట్, 1980) కింద ఏర్పాటైన ప్రధాన జాతీయ వత్తిపరమైన సంస్థ. ఐసీఎస్ఐ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) అధికార పరిధిలో పనిచేస్తుంది.
భారతదేశం/విదేశాలలో క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు అవకాశాలు ఏమిటి?
కార్పొరేట్ సెక్టార్‌తో పాటు ప్రాక్టీస్‌లో క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీలకు అద్భుతమైన అవకాశాలున్నాయి.
కంపెనీ సెక్రటరీ (సీఎస్) కోర్సు గురించి ఏమిటి?
సీఎస్ కోర్సు 3 దశలను కలిగి ఉంటుంది. సీఎస్ఈఈటీ, సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రవేశ పరీక్ష -6 నెలలు, సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ - 9 నెలలు, పరిశ్రమ పీసీఎస్తో 21 నెలల ప్రాక్టికల్ శిక్షణ (ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత), సీఎస్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ - 15 నెలలు.
సీఎస్ కోర్సు పూర్తి చేయడానికి మొత్తం వ్యవధి మరియు ఫీజులు?
ఇంటర్మీడియట్/డిగ్రీ పూర్తయిన తర్వాత (3.5 సంవత్సరాలు -4 సంవత్సరాలు)
సీఎస్ పరీక్షలకు కోచింగ్ సదుపాయాన్ని మనం ఎక్కడ పొందవచ్చు?
ఐసీఎస్ఐ చాప్టర్ కార్యాలయాలు, ప్రైవేట్ కోచింగ్ సంస్థల నుంచి పొందవచ్చు.
ఇది ఇంజినీరింగ్ / డిస్టెన్స్ మోడ్ వంటి పూర్తి సమయం కోర్సునా?
ఈ కోర్సు ఇంజనీరింగ్ లాంటిది కాదు. ఇది డిస్టెన్స్ మోడ్ లాంటిది, ఇక్కడ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం చేయడానికి ఎడ్యుకేషన్ మెటీరియల్‌ని అందిస్తుంది.
సగటు విద్యార్థి సీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలరా?
క్లియర్ చేయడానికి విద్యార్థి అంకితభావం మరియు తెలివైన పనిని కలిగి ఉండాలి.