Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్యాభర్తలు 33 జిల్లాల్లో పనిచేసే అవకాశం కల్పించాలి
- టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ డిమాండ్ చేశారు. టీఎన్జీవోల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఆ సంఘం కార్యాలయంలో జరిగింది. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు. నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది.
ఈ సమావేశంలో కేంద్ర కార్యవర్గ సభ్యులు కె రాజేశ్ కుమార్, ఎం సత్య నారాయణగౌడ్, రామినేని శ్రీనివాసరావు, ఎస్ శ్యామ్ సుందర్, ఎన్ఎన్ స్వామి, చెపురి నర్సింహాచారి, ఉమాదేవి, నజీర్ అహ్మెద్, ఎంబి నరేందర్, టి పర్వతాలు, తిరుమలరెడ్డి, బి రాము, ఎస్. లక్ష్మణ్‌రావు, వి రవి, వి మాధవి, జి చంద్రశేఖర్, కె రమేశ్, ఈ కొండల్‌రెడ్డి, కె జగదీశ్వర్, కె శ్రీనివాస్, వి సిద్దిరామ్, పి నర్సింహులు, టి శైలజ, వి రాఘవేందర్రావు, ఎస్ సంతోష్, పి ఈశ్వర్, ఎం సారంగపాణి, ఎండి షఫీ అహ్మద్, కె ఆంజనేయులు, యు చంద్రశేఖర్, శ్రీకాంత్, ఎన్ మురళితోపాటు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు.
తీర్మానాలు :
- 317 ఉత్తర్వులలో భార్యాభర్తలకు (స్పౌజ్) అన్ని జిల్లాల్లో (33) పనిచేసేందుకు అవకాశం కల్పించాలి.
- ఉద్యోగుల పరస్పర బదిలీలలో జిల్లా క్యాడర్ సీనియార్టీ భద్రతను కల్పించిన విధంగా జోనల్ క్యాడర్ పోస్టులకూ పాత సీనియార్టీ భద్రత కల్పించాలి. జిల్లా, జోనల్ బదిలీల్లో అన్ని స్థాయిల ఉద్యోగులు చేసుకున్న సరైన అర్జీలను పరిష్కరించాలి.
- ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం పీఆర్సీ కమిటీ సూచించిన విధంగా అన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలి. అందుకుగాను ఉద్యోగుల మూల వేతనం నుంచి రెండు శాతం వేతనాన్ని ప్రభుత్వానికి చెల్లించాలని నిర్ణయించింది.
- పీఆర్సీలో గల వ్యత్యాసాలను సవరించడం కోసం వెంటనే అనామలిస్ కమిటీ ఏర్పాటు చేయాలి. పెండింగ్‌లో ఉన్న అన్ని ఉత్తర్వులనూ విడుదల చేయాలి.
- మెడికల్ ఇన్ వాలిడేషన్ కోసం రాష్ట్రస్థాయి కమిటీని నియమించాలి. అది పొందిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు కల్పించాలి.
- సాధారణ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయాలి.
- రాష్ట్రంలో వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి.