Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రైనీ మహిళా పైలెట్ మృతి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ పరిధిలో పొలాల్లో చాపర్ కుప్పకూలింది. మొదటగా దట్టమైన పొగకమ్ముకొని, మంటలతో కూలిపోగా.. పెద్దఎత్తున శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు. పెద్దవూర మండల రెవెన్యూ, పోలీసులు, వైద్యసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం ముక్కముక్కలుగా విరిగిపోయింది. ఒకరు చనిపోయారు. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వద్ద గల ప్రయివేటు ఏవియేషన్ అకాడమీకి చెందిన చాపర్గా గుర్తించారు. సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తారు. మాచర్లలో 10.30గంటలకు టేకాఫ్ అయింది. కేవలం 20నిమిషాల వ్యవధిలోనే ఎయిర్క్రాష్ అయింది. అయితే స్థానికుల ప్రకారం.. హైటెన్షన్ విద్యుత్ వైర్లను తగిలి క్రాష్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో మహిళా ట్రైనీ పైలెట్ ఒక్కరే ఉన్నారు. ఆమె చెన్నరుకి చెందిన మహిమగా గుర్తించారు. ప్రమాద స్థలానికి జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏవియేషన్ అకాడమి అధికారులు చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు బీసీసీఐ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలియాల్సి ఉందని, ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఎస్పీ తెలిపారు. పైలెట్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి చెన్నరుకి తరలించారు.